
తెలంగాణ సచివాలయం కూల్చివేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గత ఏడాది మూడు ప్రజాహిత పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ వాటిపై కౌంటర్ దాఖలు చేశారు.
దానిలో...భావితరాల అవసరాలకు తగినట్లుగా అత్యాధునిక సచివాలయం నిర్మించాలనుకొంటున్నట్లు స్పష్టం చేశారు. కొత్త సచివాలయం నిర్మాణం కోసం పాతది పూర్తిగా తొలగించవలసి ఉంటుందని తెలిపారు. కొత్త సచివాలయం నిర్మాణానికి సుమారు రూ.300-400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనావేశామని తెలిపారు. సచివాలయం నిర్మాణం సుమారు 12 నెలలో పూర్తయ్యే అవకాశమున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. సచివాలయ భవనం డిజైన్ ఇంకా ఖరారు కాలేదని, ఖరారైతే రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సునీల్ శర్మ హైకోర్టుకు తెలియజేశారు.