
నేటి నుంచి ప్రారంభమైన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా వరంగల్లో జరిగిన సభలో ఎర్రబెల్లి మాట్లాడుతూ, “కేటీఆర్ నాయకత్వంలో ఎదుర్కొన్న అన్ని ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించింది. అలాగే ప్రభుత్వంలో ఆయన కీలక శాఖలను ఎంతో సమర్ధంగా నిర్వర్తిస్తున్నారు. కనుక కేసీఆర్ తరువాత సిఎం పదవికి కేటీఆరే అన్ని విధాలా అర్హుడు. ఆయనను ఎప్పుడు సిఎం చేయాలనేది సిఎం కేసీఆర్ నిర్ణయిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నెహ్రూ కుటుంబం దేశాన్ని పాలించగా తప్పుకానిది ఆంద్రాపాలకుల నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం సాధించిన కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తే తప్పేమిటి?అయినా రాహుల్ గాంధీ, నారా లోకేశ్ లాగ కేటీఆర్ అసమర్దుడు కారు. అన్ని విధాలా తన సమర్ధత నిరూపించుకొన్నారు. కనుక ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయన అన్ని విధాలా అర్హుడే,” అని ఎర్రబెల్లి అన్నారు.