హోంగార్డులకు సజ్జనార్ నూతన సంవత్సర కానుక

సైబరాబాద్‌ కమీషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ ఒక అరుదైన గొప్ప ఆలోచనకు ఆచరణలో పెట్టి చూపారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులతో సమానంగా పనిచేస్తున్న పనిచేస్తున్న హోంగార్డుల కోసం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీనీ ప్రారంభించారు. కమీషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 1049 మంది హోంగార్డులు దీనిలో సభ్యత్వం కల్పించారు. వారు ప్రతీనెల కొంత మొత్తం దానిలో పొదుపు చేసుకొని అవసరమైనప్పుడు రూ.50,000 వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. దానిపై ఏడాదికి 6 శాతం మాత్రమే వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. అలాగే అత్యవసర సమయంలో తక్షణసాయం క్రింద రూ.20,000 సొసైటీ నుంచి తీసుకోవచ్చు. ఈ సొసైటీలో సభ్యులుగా చేరిన హోంగార్డులు అందరికీ త్వరలో మెడికల్ ఇన్స్యూరెన్స్ కూడా కల్పించబోతున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల కోసం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీనీ ఏర్పాటు చేయడం ఇదే ప్రధమం. తమ కోసం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీనీ ఏర్పాటు చేయడంపై హోంగార్డులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.