
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 26న డిల్లీలో జరుగబోయే రిపబ్లిక్ డే పరేడ్‌కు తెలంగాణ శకటం ఎంపికైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. వరంగల్ చారిత్రిక ప్రాశస్త్యం తెలియజేసే వేయి స్థంబాల గుడి, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం జాతర, బతుకమ్మ, బోనాల పండుగల గురించి తెలియజేసేవిధంగా తెలంగాణ శకటాన్ని రూపొందించారు. శకటం ఇరువైపులా తెలంగాణ కళాకారులు ఆడిపాడుతూ కళాప్రదర్శనలు చేస్తారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2015లో తెలంగాణ శకటం ఎన్నికైంది. మళ్ళీ 5 ఏళ్ళ తరువాత 2020 రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపికయింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో త్రివిద దళాలు, వాటి ఆయుధ సంపత్తిని, వివిదరాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శిస్తుంటారు. ఆవిగాక విద్యార్దులు, కళాకారుల ప్రదర్శనలుంటాయి.