సంబంధిత వార్తలు

క్రిస్మస్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ విందు ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని పలువురు క్రీస్టియన్ ప్రముఖులు, ప్రజలు ఈ విందుకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయని అడిషనల్ సీపీ అనిల్‌కుమార్ తెలియజేశారు. కనుక నగరవాసులు వేరే మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలు చేరుకోవడం మంచిది.