హైకోర్టు సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం అభ్యర్ధన మేరకు హైకోర్టు 36 ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఇవి కేవలం అత్యాచార కేసులు, చిన్నారులపై లైంగిక దాడుల కేసులను మాత్రమే విచారిస్తాయని హైకోర్టు తెలిపింది. రాష్ట్రంలో ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలకు రెండు చొప్పున, మిగిలిన జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. వీటి ఏర్పాటుతో రాష్ట్రంలో అత్యాచార కేసుల విచారణ వేగవంతం అవుతుంది కనుక దోషులకు వెంటవెంటనే శిక్షలు కూడా పడుతుంటాయి. అప్పుడే ఇటువంటి నేరాలకు పాల్పడాలనుకొనేవారికి భయం ఏర్పడుతుంది కనుక అటువంటి ఆలోచనలను విరమించుకొనే అవకాశం ఉంటుంది.