తెలంగాణ జనసమితి నూతన కార్యవర్గం ఏర్పాటు

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం శుక్రవారం పార్టీ రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గాన్ని నియమించారు. వారిలో పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, రాజమల్లయ్య, రమేష్‌రెడ్డి, సయ్యద్‌ బదృద్దీన్ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. జి.శంకర్‌రావు, జి.వెంకట్‌రెడ్డి, కె.ధర్మార్జున్, ఎ.శ్రీనివాస్‌లు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా,   భవానీరెడ్డి, బాబన్న, మురళీధర్, బైరి రమేశ్‌లు ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా, ముజాహిద్, రాయప్ప, రాజు, ఆశప్పలు జాయింట్ సెక్రెటరీలుగా నియమితులయ్యారు. డిపి రెడ్డిని కోశాధికారిగా నియమించారు. మంత, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్ రావు, మోహన్ రెడ్డిలు కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. కొత్త కార్యవర్గం సారధ్యంలో తెలంగాణ జనసమితి ప్రజలకు మరింత చేరువయ్యి ప్రజా సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేస్తుందని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు.