ఆ బిల్లుకు తెరాస వ్యతిరేకం...

కేంద్రప్రభుత్వం ఈరోజు పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అది ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్న ప్రతిపక్ష సభ్యులు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో కొన్ని కీలక బిల్లులకు మద్దతు పలికినా తెరాస కూడా ఈ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించింది. కనుక తమ ఏడుగురు ఎంపీలకు ఈరోజు వి‌ఐ‌పి జారీ చేసింది. తెరాస ఎంపీలందరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించింది. లోక్‌సభలో బిజెపికి పూర్తి మెజార్టీ ఉంది కనుక ఈ బిల్లుపై ప్రతిపక్షాలు ఎంతగా అభ్యంతరం చెప్పినప్పటికీ ఆమోదింపజేసుకోగలదు. కానీ రాజ్యసభలో బిజెపికి బలం తక్కువగా ఉంది కనుక వైసీపీ, అన్నాడిఎంకె, బిజెడి వంటి ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టుకోవలసి ఉంటుంది. ఒకవేళ రాజ్యసభలో కూడా ఈ బిల్లును ఆమోదింపజేసుకోగలిగితే అది దేశంలో పెను సంచలనం సృష్టించవచ్చు. 

ఈ బిల్లు అమలులోకి వస్తే బాంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి స్థిరపడిన లక్షలాదిమంది తిరిగి స్వదేశాలకు పంపించే ప్రయత్నాలు మొదలవుతాయి. కనుక దేశంలో పెను సంచలనం సృష్టించవచ్చు.