సంబంధిత వార్తలు

హైకోర్టు ఆదేశాల మేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమారు వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు తెలియజేయాలని కోరుతూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దాని ప్రకారం డిసెంబర్ 4 నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల పునర్విభజనపై ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియజేయవచ్చు. ఈనెల 16లోగా వాటన్నిటినీ పరిశీలించి, పరిష్కరిస్తారు. ఆ ముసాయిదాను స్థానిక కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపిన తరువాత డిసెంబర్ 17న తుది జాబితా ప్రకటిస్తారు. దాని ఆధారంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది.