సంబంధిత వార్తలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు వారాలలోగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ, వార్డుల విభజన కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. కనుక మున్సిపల్ ఎన్నికలపై మళ్ళీ ఎటువంటి అభ్యంతరాలు, పిటిషన్లు దాఖలవనట్లయితే డిసెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.