
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆధార్ సేవా కేంద్రం హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో ప్రారంభమయింది. ఈ సేవా కేంద్రం యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఏఐ) అధ్వర్యంలో నిర్వహించబడుతుంది. జంటనగరాల ప్రజలతో పాటు ఇరుగుపొరుగు ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడ కొత్తగా ఆధార్ కార్డులకు దరఖాస్తు చేసుకొని పొందవచ్చు. అలాగే ఆధార్ కార్డులో పేరు, చిరునామా, వయసు తదితర తప్పులను సరిచేయించుకోవచ్చు. ఈ ఆధార్ సేవా కేంద్రంలో పనుల కోసం ముందుగా యుఐడిఏఐ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ సేవా కేంద్రం ఆదివారంతో సహా వారానికి ఏడు రోజులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తుంది. ఈ సేవా కేంద్రంలో రోజుకు 1,000 మందికి ఆధార్ కార్డులను ప్రాసెసింగ్ చేయగలదు. ఐదు నుంచి 15 సం.లలోపు వయసున్న పిల్లలకు ఉచితంగా ఆధార్ కార్డులు పొందవచ్చు. ఆ పైబడిన వయసు గలవారికి రూ.50 ఛార్జీతో పొందవచ్చు.