సెప్టెంబర్ జీతాల కేసు బుదవారానికి వాయిదా

టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం చెల్లించవలసిన సెప్టెంబర్ నెల జీతాలను చెల్లించవలసిందిగా దాఖలైన కేసుపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టగా, దీనిపై తమ వాదనలు వినిపించేందుకు మరికొంత గడువు ఆర్టీసీ యాజమాన్యాయం తరపున వాదించిన న్యాయవాది అభ్యర్ధనను హైకోర్టు త్రోసిపుచ్చింది. తదుపరి విచారణ బుదవారం చేపడుతామని ఆరోజున సంతృప్తికరమైన సమాధానంతో హాజరుకావాలని ఆదేశించింది. 

ఆర్టీసీ యాజమాన్యం అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడిపిస్తూ ప్రజల ప్రాణాలకు ప్రమాదం సృష్టిస్తోందని కనుక వారికి 90 రోజులు శిక్షణ ఇప్పించాలని కోరుతూ గోపాలకృష్ణ అనే న్యాయవాది సోమవారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై 4 వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఆర్టీసీ సమ్మె, హైకోర్టు తీర్పులు, ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతిపాదనలు, ఆర్టీసీ ప్రైవేటీకరణ తదితర అంశాలపై సిఎం కేసీఆర్‌ ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తుంన్నందున దానిలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకోదలిస్తే వారికి సెప్టెంబర్ జీతాల చెల్లించవచ్చు. ఆర్టీసీ కార్మికులను విధులలోకి తీసుకొన్నట్లయితే ఈ రెండు కేసులు ముగిసిపోతాయి.