1.jpg)
తెలంగాణ కాంగ్రెస్ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ బిజెపిపై నిశిత విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీ సమస్య గురించి మాట్లాడేందుకు కేంద్ర రవాణామంత్రి నితిన్ గడ్కారీ సిఎం కేసీఆర్‌కు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదని బిజెపి నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. అయినా 48 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతుంటే రాష్ట్ర బిజెపి నేతలు ఏమి చేస్తున్నారు? వారికి ఏవిధంగా సహాయపడ్డారు? ఆర్టీసీలో 30 శాతం వాటా ఉన్న కేంద్రప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేదు?
తెరాస, బిజెపిలు బద్దశత్రువులన్నట్లు ప్రవర్తిస్తుంటాయి. కానీ ఆరెండు పార్టీలకు జాతీయస్థాయిలో మంచి బలమైన దోస్తీ ఉంది. బిజెపి జాతీయ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్‌జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు తెరాస సర్కార్ చేపడుతున్న అభివృద్ధి పనులలో భారీగా అవినీతి జరుగుతోందని విమర్శిస్తుంటారు. కానీ కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ ఆ అవినీతిపై సిబిఐ విచారణకు ఆదేశించరు...ఎందుకు? తెరాస-బిజెపిల మద్య బందం ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి? బహుశః అందుకే కేంద్రప్రభుత్వం ఇంతవరకు ఆర్టీసీ సమ్మె విషయంలో కలుగజేసుకోలేదని నేను భావిస్తున్నాను. భవిష్యత్‌లో మా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు మేము తప్పకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు.