
సోమవారం ఉదయం కాచిగూడ స్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఎంఎంటీఎస్ రైలు ఇంజనుబోగీలో చిక్కుకుపోయిన లోకో పైలట్ చంద్రశేఖర్‌ను 8 గంటల పాటు శ్రమించి ఎన్జీఆర్ఎఫ్ బృందాలు క్షేమంగా వెలికితీశాయి. ఈ ప్రమాదంలో ఆయనకు మెడ, కాళ్ళు, చేతులపై తీవ్రగాయాలైనట్లు సమాచారం.
ఆయన ఇంజనులో చిక్కుకొని ఉండగానే వైద్యసిబ్బంది ఆయనకు సిలైన్ ఎక్కిస్తూ, గొట్టాలతో లోపలకు ఆక్సిజన్ సరఫరా చేస్తూ ప్రాణాలు కాపాడుతుండగా, అదే సమయంలో ఎన్జీఆర్ఎఫ్ సిబ్బంది లోపల ఉన్న ఆయనకు ఎటువంటి ప్రమాదం కలుగకుండా చాలా జాగ్రత్తగా గ్యాస్ కట్టర్స్, ఇతర పరికరాలతో ఇంజను ముందు భాగాలను, కిటికీలను ముక్కలు ముక్కలుగా కత్తిరించి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ఆయనను వెంటనే కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
సిగ్నల్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఎంఎంటీఎస్ రైలు ఎదురుగా ఉన్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును డ్డీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని భావించినప్పటికీ, ప్రాధమిక దర్యాప్తు జరిపిన రైల్వే అధికారులు లోకో పైలట్ చంద్రశేఖర్ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు చెపుతున్నారు. హంద్రీ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్ లభించడంతో మెల్లగా ముందుకు సాగుతున్న సమయంలో, గ్రీన్ సిగ్నల్ పడకముందే చంద్రశేఖర్ ఎంఎంటీఎస్ రైలును ముందుకు నడిపించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెపుతున్నారు. అయితే ఆ సమయంలో రెండు రైళ్ళు చాలా మెల్లగా నడుస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు కానీ ఎవరికీ ప్రాణాపాయం లేదని ఉస్మానియా వైద్యులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షి కధనం: