సంబంధిత వార్తలు

హైదరాబాద్లో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. కాచిగూడా రైల్వేస్టేషన్ ఔటర్లో సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న చిలుకూరు-కాగజ్ నగర్ ప్యాసింజర్ రైలును ఎంఎంటీఎస్ రైలు డ్డీకొంది. ఎంఎంటీఎస్ రైలు అప్పటికి తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నందున పెను ప్రమాదం తప్పింది. సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా ఎంఎంటీఎస్ రైలు ప్యాసింజర్ రైలు ఉన్న ట్రాకుపైకి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ రైలుకు చెందిన 2-3 బోగీలు దెబ్బ తిన్నాయి... పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరుగలేదు కానీ 10 మందికి గాయాలయ్యాయి. వారిని రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు.