సంబంధిత వార్తలు

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు ఓ శుభవార్త! ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 3.144 శాతం డీఏ (కరువు భత్యం) పెంచుతూ రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం 30.392 శాతం ఉన్న ఉద్యోగుల డీఏ 33.536 శాతానికి పెరిగింది.
ఈ పెంచిన డీఏలో జనవరి నుంచి అక్టోబర్ వరకు చెల్లించవలసిన మొత్తాన్ని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమా చేయబడుతుంది. నవంబర్ నెల నుంచి పెంచిన డీఏ మొత్తాన్ని జీతంతో కలిపి డిసెంబరులో ఉద్యోగులకు చెల్లిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 29కి ముందుగా రిటైర్ కాబోతున్న ఉద్యోగులకు మాత్రం ఈ డీఏ బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తుంది.