హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌లో నేడు మరో ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవమయ్యింది. మోహిదీపట్నం నుంచి ఖాజాగూడ వైపు వెళ్ళేందుకు బయోడైవర్సిటీ చౌరస్తా వద్ద నిర్మించిన రెండవ లెవెల్ ఫ్లై ఓవర్‌ను నేడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెరాస ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, అధికారులు పాల్గొన్నారు. 

రూ.69.47 కోట్లు వ్యయంతో మూడు లేన్లతో నిర్మించబడిన ఈ ఫ్లై ఓవర్ పొడవు 990 మీటర్లు, వెడల్పు 11.5 మీటర్లు. ఇది అందుబాటులోకి రావడంతో  హైటెక్‌సిటీకి రాకపోకలు సాగించేవారికి ట్రాఫిక్ కష్టాలు కొంత తగ్గుతాయి. ముఖ్యంగా గచ్చిబౌలీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది.