సంబంధిత వార్తలు

అక్రమాస్తుల కేసుల విచారణలో ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి సిబిఐ కోర్టులో ఈరోజు ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనకు ప్రతీ శుక్రవారం ఈ కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావడం కష్టమని కనుక మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. దానిపై అక్టోబర్ 18న ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. నాంపల్లి సిబిఐ కోర్టు ఈరోజు ఆ పిటిషన్‌పై తుది తీర్పు వెలువరిస్తూ జగన్ అభ్యర్ధనను తిరస్కరించింది.