సంబంధిత వార్తలు

సికింద్రాబాద్-విశాఖపట్నం మద్య ఇటీవల రద్దీ పెరిగినందున వారానికి ఒక రోజున స్పెషల్ ట్రైన్ నడిపించాలని తూర్పు కోస్తా రైల్వే నిర్ణయించింది. ఈ కొత్త సర్వీసులు నవంబర్ 2 నుంచి డిసెంబర్ 3వరకు మాత్రమే నడుస్తాయి.
ట్రైన్ నంబర్: 08251 విశాఖ నుంచి ప్రతీ శనివారం ఉదయం 10.50 గంటలు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకొంటుంది. అలాగే ట్రైన్ నంబర్: 08522 ప్రతీ ఆదివారం సికింద్రాబాద్లో సాయంత్రం 4.30కు బయలుదేరి మర్నాడు తెల్లవారుజామున 4.50కు విశాఖకు చేరుకొంటుంది.