
ఆర్టీసీ కార్మిక సంఘాలు రేపు సరూర్‌నగర్‌లో నిర్వహించదలచిన సకలజనుల సమరభేరి బహిరంగసభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సభకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభనునిర్వహించుకోవాలనుకొన్నారు. కానీ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే హైకోర్టు అనుమతించింది. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రేపటి సభకు జోరుగా ఏర్పాట్లు చేసుకొంటున్నాయి. కానీ రేపటి సభకు ప్రభుత్వం, పోలీసులు ఇంకా ఎటువంటి ఆటంకాలు సృష్టిస్తారో? అని ఆర్టీసీ కార్మిక సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.