హుజూర్‌నగర్‌పై కేసీఆర్‌ వరాల జల్లు

హుజూర్‌నగర్‌లో ఈరోజు మధ్యాహ్నం భారీవర్షం కురిసింది. వర్షం వెలిసిన తరువాత సిఎం కేసీఆర్‌ నియోజకవర్గంపై వరాల జల్లులు కురిపించారు. అనేక అపోహలు, అపవాదులు, విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో హుజూర్‌నగర్‌ ప్రజలు తెరాసని గెలిపించి ప్రభుత్వం వెంట ఉన్నామని చాటిచెప్పినందుకు సిఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కేవలం కృతజ్ఞతలు తెలుపుకోవడమే కాక హుజూర్‌నగర్‌ నియోజకవర్గం అభివృద్ధికి అనేక వరాలు ప్రకటించారు. ఆ వివరాలు క్లుప్తంగా: 

1. హుజూర్‌నగర్‌లో 134 గ్రామ పంచాయతీలలో ప్రతీ గ్రామ పంచాయితీ అభివృద్ధి పనులకోసం రూ.20 లక్షలు.

2. ఒక్కో మండలానికి రూ.30 లక్షలు  

3. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.25 కోట్లు

4. హుజూర్‌నగర్‌లో కల్వర్టులు 

5. నేరేడుచెర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు 

6. హుజూర్‌నగర్‌కు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తాం.  

7. హుజూర్‌నగర్‌లో కోర్టు ఏర్పాటు చేస్తాం 

8. నియోజకవర్గంలో బంజారా భవన్ నిర్మిస్తాం. 

9. నియోజకవర్గంలో ఈ.ఎస్.ఐ. ఆసుపత్రి నిర్మిస్తాం.   

10. నియోజకవర్గంలో ఈ.ఎస్.ఐ. ఆసుపత్రి నిర్మిస్తాం.

11.  నియోజకవర్గంలో గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్మిస్తాం.

12. నియోజకవర్గంలో పాలిటెక్నిక్‌ కాలేజీ నిర్మిస్తాం.   

13. నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మిస్తాం.   

14. పోడుభూముల సమస్యను పరిష్కరిస్తాం. 

15. సిఎం ప్రత్యేకనిధి నుంచి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం.