హుజూర్‌నగర్‌లో భారీ వర్షం

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలకు ముందు సిఎం కేసీఆర్‌ అక్కడ బహిరంగసభ నిర్వహించాలనుకొన్నారు. కానీ వర్షం కారణంగా సభను రద్దు చేసుకోవలసి వచ్చింది. మళ్ళీ ఇవాళ్ళ సాయంత్రం హుజూర్‌నగర్‌లో బహిరంగసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకొని హైదరాబాద్‌ నుంచి బయలుదేరి సూర్యాపేట చేరుకొన్నాక, మళ్ళీ భారీ వర్షం మొదలైంది. భారీవర్షం కారణంగా సభాప్రాంగణం అంతా బురదబురదగా మారింది. కుర్చీలన్నీ తడిసిపోయాయి. 

సిఎం కేసీఆర్‌ సభకు వరుసగా రెండుసార్లు వర్షం అడ్డంకిగా మారడం విశేషం. మొదటిసారి హెలికాఫ్టర్‌లో వచ్చేందుకు సిద్దపడగా వర్షం కారణంగా ప్రయాణం రద్దు చేసుకోవలసి వచ్చింది. ఈసారి రోడ్డు మార్గంలో వచ్చినా వర్షం బెడద తప్పలేదు. 

మధ్యాహ్నం 2 గంటలకు ఇంకా వర్షం కురుస్తూనే ఉండటంతో నేడు సభ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. సాయంత్రం 4లోగా వర్షం పూర్తిగా తగ్గిపోతే సిఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ చేరుకొని సభ నిర్వహిస్తారు లేకుంటే వెనుతిరిగి వెళ్లిపోవచ్చునని సమాచారం.