12.jpg)
ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హుజూర్‌నగర్‌లో జరుగబోయే బహిరంగసబాలో పాల్గొనేందుకు సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరారు. ఆయన మధ్యాహ్నం 1.30 గంటలకు సూర్యపేట పట్టణం చేరుకొని ఆకక్ద త్రివేణి ఫంక్షన్ హాల్‌లో స్థానిక తెరాస ముఖ్యనేతలతో కలిసి భోజనం చేస్తారు. కాసేపు విశ్రాంతి తీసుకొన్న తరువాత మధ్యాహ్నం 3 గంటలకు హుజూర్‌నగర్ సభావేదికవద్దకు చేరుకొంటారు. సభ ముగిసిన తరువాత మళ్ళీ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ తిరుగుప్రయాణం అవుతారు.
ఈ సభలో సిఎం కేసీఆర్ హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధికి వరాలు ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తుండటంతో సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం కూడా ఉంది. కనుక తెరాస నేతలు అందుకు తగ్గట్లుగానే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సభ ప్రారంభం అయ్యే సమయానికి గంట ముందు హైదరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ నేతలతో టి. వెంకటేశ్వరరావు కమిటీ చర్చలు ప్రారంభిస్తుంది. కనుక సభ ముగిసేలోగా చర్చలు ముగిస్తే సిఎం కేసీఆర్ వాటిపై కూడా సభలో ప్రకటన చేసే అవకాశం ఉంది.