చర్చలకు ఆహ్వానం వచ్చింది

ఆర్టీసీ సమ్మెపై మొదటి నుంచి చాలా కటినవైఖరితో వ్యవహరిస్తున్న సిఎం కేసీఆర్‌, వారి డిమాండ్లపై కమిటీ ఇచ్చిన నివేదికపై అధికారులతో శుక్రవారం సాయంత్రం చర్చించిన తరువాత చర్చలకు అనుమతించారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ భవనంలో చర్చలకు రావాలని టి.వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలను ఆహ్వానించింది. ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి, జేఏసీ నేతలు రాజిరెడ్డి,వాసుదేవరావు, వీఎస్ రావులను చర్చలలొ పాల్గొనబోతున్నారు. ఈ చర్చలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అశ్వధామరెడ్డి చెప్పారు.