ఎన్నికల తుది ఫలితాలు

మహారాష్ట్ర, హర్యానాతో సహా 51 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. మహారాష్ట్రలో 288 స్థానాలలో బిజెపి, శివసేన కూటమి 167 స్థానాలు గెలుచుకొని స్పష్టమైన మెజారిటీతో అధికారం చేజిక్కించుకొంది. హర్యానాలో బిజెపి 40, కాంగ్రెస్‌ 31 స్థానాలు గెలుచుకొన్నాయి. కానీ రెండు పార్టీలు మ్యాజిక్ ఫిగర్ 46 సాధించలేకపోవడంతో 10 స్థానాలు సాధించిన జేజేపి, 9 స్థానాలు సాధించిన ఇతరుల మద్దతు కోరకతప్పడం లేదు.