సంబంధిత వార్తలు

ఊహించినట్లుగానే హుజూర్‌నగర్‌లో తెరాస అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి మొదటి రౌండ్ నుంచే ఆధిక్యతలో దూసుకు పోతున్నారు. ఇప్పటి వరకు 6 రౌండ్లు లెక్కింపు పూర్తయింది. వాటిలో సైదిరెడ్డి సుమారు 14,000 ఓట్లు ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. తెరాసకు గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతీ రెడ్డి వెనుకబడిపోయారు. బిజెపి, టిడిపిలు ఇంకా ఖాతా తెరువలేదు.