తెలంగాణ హోంశాఖ కార్యదర్శి మార్పు

తెలంగాణ హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది స్థానంలో ప్రస్తుతం అధనపు డైరెక్టర్ జనరల్ (టెక్నాలజీ)గా పనిచేస్తున్న   రవిగుప్తాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ త్రివేదిని జైళ్ళశాఖ డీజీగా బదిలీ చేసింది. పురపాలక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శిని మార్చడం విశేషం.