త్వరలో మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు మళ్ళీ విచారణ చేపట్టిన హైకోర్టు వాటన్నిటినీ కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కనుక త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చు. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉదృతంగా సాగుతున్నందున ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినట్లయితే తెరాస చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం తీసుకొనే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం నేడో రేపో దీనిపై స్పష్టతనీయవచ్చు.