హర్యానా, మహారాష్ట్రలలో పోలింగ్ ప్రారంభం

హర్యానా, మహారాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యింది. హర్యానాలో 90, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి కాక నేడు తెలంగాణతో సహా  దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో 51 అసెంబ్లీ,2 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 24న ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.