ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు: అశ్వథామరెడ్డి

ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేయడంపై స్పందించిన ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి, ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఇటువంటి ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో పోరాడి తమ డిమాండ్లను సాధించుకొందామని కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు. కొందరు మంత్రులు ఆర్టీసీ కార్మికుల సమ్మెను అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని వారికి సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెపుతారని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న తెరాస సర్కార్‌కు పతనం ప్రారంభం అయ్యిందని అశ్వథామరెడ్డి అన్నారు.