బీచ్‌లో ప్రధాని మోడీ స్వచ్చా భారత్

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చల కోసం తమిళనాడులోని మహాబలిపురంలో బస చేసిన ప్రధాని నరేంద్రమోడీ, శనివారం తెల్లవారుజామున మార్నింగ్ వాక్ కోసం సమీపంలోని బీచ్‌కు వెళ్లారు. సుమారు అరగంటసేపు బీచ్‌లో ఒంటరిగా వాకింగ్ చేసిన ప్రధాని నరేంద్రమోడీ దారిలో కనిపించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరి సంచులలో పోసి కొంతమేర శుభ్రం చేశారు. కాలికి చెప్పులు కూడా లేకుండా బీచ్‌ ఒడ్డున నడుస్తూ దారిలో కనబడిన ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరడం విశేషం. అనంతరం ఈ విషయం ట్విట్టర్‌ ద్వారా షేర్ చేస్తూ, బహిరంగ ప్రదేశాలలో అందరూ పరిశుభ్రతను పాటించాలని, శారీరికశ్రమ చేస్తూ ఆరోగ్యవంతంగా జీవించాలని ట్వీట్ చేశారు. 

ప్రధాని నరేంద్రమోడీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత నిరాడంబరంగా, ప్రజలకు ఆదర్శంగా వ్యవహరించడం గొప్ప విషయమే. ఆ ఫోటోలు, వీడియోను మీరు చూడండి..అవునని ఒప్పుకొంటారు.