
తెలంగాణ సర్కార్ మరోసారి నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. ఇప్పటికే ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తూ.. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న సర్కార్ తాజాగా గురుకుల విద్యాసంస్థల్లోని ఖాళీలపై కూడా దృష్టి సారించింది. గతంలో ప్రకటించిన పోస్టులకు అదనంగా మరిన్ని పోస్టులను పెంచుతూ గురుకుల విద్యాలయాలకు నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమైంది.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1794 పోస్టుల భర్తీకి టి సర్కార్ పచ్చ జెండా ఊపింది. గతంలో ప్రకటించిన 758 పోస్టులకు అదనంగా మరో వెయ్యికి పైగా పోస్టులను కలిపి 1794 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధమైంది. గురుకుల పాఠశాలల్లో 1164 పోస్టులు, గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో 630 పోస్టులు ఉన్నాయి. గురుకుల పోస్టుల భర్తీలో కాస్త లేట్ అయినా కూడా పోస్టుల సంఖ్యను పెంచి ప్రభుత్వం ప్రకటన జారీ చెయ్యడం చాలా మందికి ఆనందం కలిగించింది.