నేడు పలురాష్ట్రాలలో అతిభారీ వర్షాలు

నేడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఒడిశా, అసోమ్, మేఘాలయ రాష్ట్రాలలో పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని డిల్లీలోని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలు, రాష్ట్రంలో పలు జిల్లాలలో, ఏపీలోని రాయలసీమ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాలలో పిడుగులు కూడా పడవచ్చునని హెచ్చరించింది.

మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో బారీ వర్షం పడినప్పుడు ఓల్డ్ మలక్‌పేటలోని ఒక ఇంటిపై పిడుగుపడింది. కానీ అదృష్టవశాత్తు ఆ ఇంట్లో నివసిస్తున్నవారు ముందుగానే వేరే చోటికి వెళ్ళి ఆశ్రయం పొందడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. పిడుగుధాటికి ఇంటి కప్పు, గోడలు బాగా తిన్నాయి. 

ఈ అకాలవర్షాలు ఇంకా ఎప్పటికీ ఆగుతాయో తెలియదు.  పైగా ఇదే సమయంలో ఆర్టీసీ సమ్మె కూడా జరుగుతుండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బుదవారం కూడా మళ్ళీ భారీ వర్షం పడవచ్చునని వాతావరణశాఖ హెచ్చరించినందున నగరప్రజలందరూ ఎవరి జాగ్రత్తలో వారుండటం చాలా మంచిది.