ఆగష్టు7న కొత్త జిల్లాల నోటిఫికేషన్

దసరా పండుగ నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేస్తామని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. దాంతో ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు మీద ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు(ఆగష్టు4) జిల్లాల పునర్విభనపై ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. దీనిలో కొత్త జిల్లాల రూట్ మ్యాప్ ఖరారావుతుందని తెలుస్తోంది. ఈ నెల 10వ తేదిన కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం. పది జిల్లాలను 24 జిల్లాలుగా ఏర్పాటు చెయ్యాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. 

ఇప్పటి వరకు కొత్తగా ఏర్పరిచే 14 జిల్లాలకు సంబంధించిన పరిపాలన విభాగాలను, వాటికి సంబంధించిన 74 మండలాలు, 12 రెవిన్యూ డివిజన్లపై కూడా ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుపై కొత్త వివాదం మొదలైంది. తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించాలంటూ ఎక్కడికక్కడ డిమాండ్లు వినిపిస్తున్నాయి. మంత్రులు కూడా తమ ప్రాంతంలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. మరి దీనిపై ఆగష్టు 7 న ఓ క్లారిటీ రానుంది.