రవి ప్రకాష్ అరెస్ట్...విచారణ

ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ను శనివారం ఉదయం హైదరాబాద్‌లో పోలీసులు అదుపులో తీసుకొని బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. రవి ప్రకాష్ నుంచి టీవీ9 న్యూస్ ఛానల్‌ను కొనుగోలుచేసిన అలందా మీడియా అనుమతి లేకుండా, ఆయన ఏబీసీఎల్‌ కంపెనీ నుంచి 12 కోట్లు నగదును తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నారని, కొత్త యాజమాన్యం న్యూస్ ఛానల్ రోజువారీ వ్యవహారాలను చూసుకోనీయకుండా అడ్డుపడ్డారని, టీవీ9 లోగోను ఇతరులకు అమ్మజూపారని, కొన్ని కీలకపత్రాలు మాయం చేశారని ఆ సంస్థ ప్రస్తుత సీఈఓ జి సింగారావు పలు పిర్యాదులు చేశారు. వాటి ఆధారంగా బంజారా హిల్స్ పోలీసులు రవి ప్రకాష్ పై సెక్షన్స్ 409, 418, 420 ల కింద కేసులు నమోదుచేశారు. ప్రస్తుతం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయనను ప్రశ్నిస్తున్నారు.