సూర్యాపేట ఎస్పీపై బదిలీ వేటు!

ఉప ఎన్నికల నేపధ్యంలో హుజూర్‌నగర్‌లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది. హుజూర్‌నగర్‌ రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ డిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తమ అభ్యర్ధి సైదిరెడ్డిని గెలిపించుకోవడానైకి పోలీసుల సహకారంతో విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నారని ఫిర్యాదు చేశారు. కె.లక్ష్మణ్‌ పిర్యాదుపై వెంటనే స్పందించిన ఈసీ సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లు స్థానంలో ప్రస్తుతం భూపాలపల్లి ఎస్పీగా పనిచేస్తున్న 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్‌. భాస్కరన్‌ను నియమించింది. వెంకటేశ్వర్లును పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఈ ఉప ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆయనకు ఎన్నికలకు సంబందించి ఎటువంటి పనులు అప్పగించవద్దని ఆదేశించింది. 

జిల్లా కలెక్టరు ఆమోయ్ కుమార్‌పై కూడా బిజెపి పిర్యాదు చేసినందున, ఎస్పీ తరువాత ఆయనను కూడా ఈసీ బదిలీ చేయబోతోందా? చూడాలి.