రేపటి నుంచి అన్ని ఆర్టీసీ డిపోలవద్ద కర్ఫ్యూ అమలు: డిజిపి

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ, త్రిసభ్య కమిటీ చర్చలు విఫలం కావడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయబోతున్నారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి అన్ని బస్ సర్వీసులు నిలిపివేస్తామని, డిపోలా నుంచి బస్సులు బయటకు వెల్లనీయమని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి ప్రకటించారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసుల రక్షణలో బస్సులు నడిపిస్తామని త్రిసభ్య కమిటీ ఛైర్మన్ సోమేష్ కుమార్ ప్రకటించారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందుజాగ్రత్త చర్యగా కనుక రాష్ట్రంలో అన్ని బస్సు డిపోల వద్ద కర్ఫ్యూ విధిస్తున్నట్లు డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. బస్సులను అడ్డుకునేందుకు ఎవరు ప్రయత్నించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటాము. ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. కనుక ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.