
శుక్రవారం అర్ధరాత్రి నుంచి టిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిరవధిక సమ్మె ప్రారంభిస్తున్నందున..ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మె ముగిసే వరకు తాత్కాలిక ప్రాతిపదికన ఆర్టీసీ బస్సు డ్రైవర్లను, కండెక్టర్ల నియామకాలు చేపట్టారు.
ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉమ్మడి మెదక్, సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. ఇతర జిల్లాలలో కూడా తాత్కాలిక ప్రాతిపదికన ఆర్టీసీ బస్సు డ్రైవర్లను, కండెక్టర్ల నియామకాలు చేపట్టే అవకాశం ఉంది కనుక ఆసక్తిగల అభ్యర్ధులు సదరు డిపో మేనేజర్లను సంప్రదించవచ్చు.
డ్రైవర్ ఉద్యోగాలకు అర్హతలు:
బస్సులు, లారీలు వంటి పెద్ద వాహనాలను నడుపడంలో మంచి అనుభవం కలిగి ఉంది, కనీసం 18 నెలల కాలపరిమితి కలిగిన హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 25 నుంచి 50 ఏళ్ళ వయసులోపు వారు అర్హులు. జీతం రోజుకు రూ. 1500.
కండెక్టర్ ఉద్యోగాలకు అర్హతలు:
కనీసం 10వ తరగతి పాస్ అయ్యుండాలి. ఈ ఉద్యోగాలకు సంగారెడ్డి డిపోలో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంపిక జరుగుతుంది. జీతం రోజుకు రూ. 1000.
కనుక ఈ తాత్కాలిక ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు సదరు డిపో, ఆర్డీఓ కార్యాలయంలో తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, దృవీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాల కోసం సిద్ధిపేట డిపో మేనేజరును 99592 26263 లేదా 995922 26266 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.