
నేడు మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకులు, దేశప్రజలు మహాత్మునికి నివాళులు ఆర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు డిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులు అర్పించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొంటున్నారు.
గాంధీ జయంతి రోజున ఆ మహాత్ముని తలుచుకోవడం అభినందనీయమే. కానీ ఆయన ఆచరించి చూపిన సత్యం, అహింస, కరుణ, నిరాడంబరత, పరిశుభ్రత వంటివి ఆచరించడం పెద్ద కష్టమేమీ కాదు. కనుక వాటిని మన జీవనవిధానంలో భాగంగా మార్చుకోగలిగినప్పుడే మహాత్మునికి నిజమైన నివాళి అవుతుంది. లేకుంటే గాంధీ జయంతి మరో పబ్లిక్ హాలీడేగానే మిగిలిపోతుందని అందరూ గుర్తుంచుకోవాలి.