నామినేషన్లకు నేడే చివరిరోజు

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు నేడే చివరి రోజు. తెరాస, కాంగ్రెస్‌,బిజెపి, టిడిపి, సిపిఎం, బిఎల్‌పిలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. సైదిరెడ్డి (తెరాస), పద్మావతి రెడ్డి (కాంగ్రెస్‌), కోటా రామారావు (బిజెపి), చావా కిరణ్మయి (టిడిపి), పారేపల్లి శేఖర్ రావు (సిపిఎం), డాక్టర్ రమణ (బిఎల్‌పి) స్వతంత్ర అభ్యర్ధిగా నవీన్ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. వీరేకాక ప్రభుత్వవిధానాలను నిరసిస్తున్న 251 సర్పంచులు కూడా నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. కనుక ఈసారి హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో మొత్తం ఎంతమంది బరిలో మిగులుతారో అక్టోబర్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత స్పష్టతవస్తుంది. మంగళవారం నామినేషన్ల పరిశీలన, గురువారం ఉపసంహరణ. అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించి, కౌంటింగ్ మరియు ఫలితాలను అక్టోబర్ 24న ప్రకటిస్తారు.