ఖండేల్ సబ్ మెరైన్ నేడు జలప్రవేశం

అత్యాధునిక స్కార్పియన్  జలాంతర్గామి నేడు భారత నావికాదళంలో చేరనుంది. శనివారం ఉదయం ముంబైలో జరిగే దీని జలప్రవేశ కార్యక్రమంలో భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. దీనిని ఫ్రాన్స్ దేశం ఇచ్చిన డిజైన్ ఆధారంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలోని మజ్ గావ్ డాక్ యార్డులో నిర్మించారు. ఈ రకంవి మొత్తం ఆరు జలాంతర్గాములను తయారుచేయవలసి ఉండగా, నేడు జలప్రవేశం చేయనున్న ఖండేల్ జలాంతర్గామితో కలిపి రెండింటిని తయారు చేసి నావికాదళానికి అందజేస్తున్నారు.

అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడిన ఈ స్కార్పియన్ జలాంతర్గామిలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఇది సముద్రంలో 350 మీటర్ల లోతున రోజుల తరబడి ప్రయాణించగలదు. అందుకోసం భారీ జనరేటర్లు, బ్యాటరీలు, ఇంజన్లు ఏర్పాటు చేయబడ్డాయి. దీనిలో 18 సెల్ఫ్ గైడడ్ మిసైల్స్, యాంటీ షిప్ మిసైల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. దీని ఉనికిని శత్రువుల రాదార్లు గుర్తించలేని విధంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయబడింది. కనుక దీనిని శత్రువులు గుర్తించేలోగానే వారి జలాంతర్గములు, యుద్ధనౌకలపై దాడులు చేయగల సత్తా ఉంది. కనుక దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని చెప్పుకోవచ్చు. ఒక్కో స్కార్పియన్ జలాంతర్గామిలో కమాండింగ్ ఆఫీసర్‌తో కలిపి మొత్తం 35 మంది సిబ్బంది ఉంటారు. పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడులు, యుద్ధభయం పెరిగినందున, ఇటువంటి అత్యాధునిక జలాతర్గామి అవసరం ఎంతైనా ఉంది.