హుజూర్‌నగర్‌ బిజెపి అభ్యర్ధి ఖరారు

హుజూర్‌నగర్‌ శాసనసభ ఉప ఎన్నికలకు బిజెపి అభ్యర్ధిగా శ్రీకళారెడ్డి పేరు ఖరారైంది. కోదాడ మాజీ ఎమ్మెల్యే జితేందర్ రెడ్డి కుమార్తె ఆమె. సీనియర్ బిజెపి నేతలు, హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆమె అభ్యర్ధిత్వాన్ని బలపరిచారు. తెరాస అభ్యర్ధిగా సైదిరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పద్మావతీ రెడ్డి, బిజెపి అభ్యర్ధిగా శ్రీకళారెడ్డి పోటీ చేయబోతున్నారు కనుక హుజూర్‌నగర్‌ స్థానానికి కాంగ్రెస్‌, బిజెపి, తెరాసలు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలో దింపుతున్నట్లు స్పష్టం అయ్యింది. అయితే ఈసారి కూడా పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌, తెరాసల మద్యనే సాగే అవకాశం ఉంది. కనుక బిజెపి గెలుపు కోసం ఆ పార్టీ నేతలు ఏదైనా వినూత్నమైన వ్యూహం రూపొందించుకోవలసి ఉంటుంది.