టిడిపి మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి

టిడిపి మాజీ ఎంపీ శివప్రసాద్(68) శనివారం మహ్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సంబందిత సమయాలతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం 2 గంటలకు మృతి చెందారు. 

శివప్రసాద్ ఎంపీగా కంటే రకరకాల వేషాలు వేసే వ్యక్తిగానే ఎక్కువ గుర్తింపు పొందారని చెప్పవచ్చు. ఏపీకి సంబందించిన సమస్యలను పార్లమెంటు సభ్యుల దృష్టికి తీసుకువెళ్ళేందుకు రోజుకో వేషంతో వెళ్ళి పార్లమెంటు ఆవరణలో హడావుడి చేసేవారు. ఆయన వేషాలపై పలువిమర్శలు ఎదురైనప్పటికీ ఆయన వెనక్కు తగ్గకుండా రకరకాలవేషాలు వేసేవారు. వృత్తిరీత్యా వైద్యుడైన శివప్రసాద్ నటనపై అభిరుచితో సినీ రంగంలో ప్రవేశించి పలుసినిమాలలో నటించారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. చంద్రబాబునాయుడుతో ఉన్న పరిచయం వలన టిడిపిలో ప్రవేశించి 2009, 2014లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019 వైసీపీ ప్రభంజనంలో ఆయన కూడా ఓడిపోయారు. ఆయన మృతిపట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.