
సిఎం కేసీఆర్ సోమవారం ఉదయం అసెంబ్లీలో, ఆర్ధికమంత్రి హరీశ్ రావు శాసనమండలిలో 2019-20 తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ముఖ్యాంశాలు:
ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్: రూ.1,82,017 కోట్లు
ఇప్పుడు ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్: రూ.1,46,492 కోట్లు
తగ్గిన మొత్తం: రూ. 35,525 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,11, 055 కోట్లు
మూలధన వ్యయం రూ. 17,274 కోట్లు
మిగులు బడ్జెట్ అంచనా రూ.2,044 కోట్లు
ఆర్థిక లోటు రూ.24,081 కోట్లు
సంక్షేమ పధకాలకు:
ఆసరా పెన్షన్లు: రూ.9,402 కోట్లు
విద్యుత్ సబ్సిడీలు: రూ.8,000 కోట్లు
రైతుబంధు: రూ.12,000 కోట్లు
రైతు రుణాల మాఫీ: రూ.6,000 కోట్లు
రైతు భీమా: రూ.1,125 కోట్లు
ఆరోగ్యశ్రీ: రూ.1,336 కోట్లు
గ్రామపంచాయతీలకు నెలకు రూ. 339 కోట్లు చొప్పున ఏడాదికి రూ.2,714 కోట్లు కేటాయింపు.
మునిసిపాలిటీలకు రూ. 1,764 కోట్లు కేటాయింపు.
1. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.20,950 కోట్లు
2. ఉదయ్ పధకం రుణభారం: రూ.9,695 కోట్లు
3. విద్యుత్ సంస్థలకు సింగరేణి చెల్లించవలసిన బకాయిలు: రూ.5,772 కోట్లు కలిపి మొత్తం రూ. 36,417 కోట్లు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని సిఎం కేసీఆర్ తెలిపారు.
దేశాన్ని ఆర్ధికమాంద్యం కమ్ముకొస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా సాగేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సిఎం కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, సీతారామ సాగునీటి ప్రాజెక్టులు యధాతధంగా సాగుతాయని తెలిపారు. వీటి కోసం నిధులు సమీకరించుకోవడానికి హైదరాబాద్లో ప్రభుత్వ భూములు అమ్మలని నిర్ణయించుకున్నామని సిఎం కేసీఆర్ తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన శాసనమండలి బుదవారానికి శాసనసభ శనివారానికి వాయిదా పడ్డాయి.