సంబంధిత వార్తలు
.jpg)
ఆదివారం సాయంత్రం ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేసిన తరువాత రాత్రి ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన పూర్తిస్థాయి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 2019-20 సం.ల పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలలో సిఎం కేసీఆర్ అసెంబ్లీలో, ఆర్ధికమంత్రి హరీష్ రావు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు వారంపది రోజులు సాగే అవకాశముంది. బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూల్, అజెండాపై స్పష్టత వస్తుంది.