సంబంధిత వార్తలు

యాదాద్రి ఆలయం స్తంభాలపై కేసీఆర్, కారు, ప్రభుత్వ సంక్షేమ పధకాల బొమ్మలపై చెలరేగిన వివాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతోందని గ్రహించడంతో వాటినన్నిటినీ తక్షణం తొలగించాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్ రెడ్డి శనివారం యాదాద్రి అభివృద్ధి బోర్డు అధికారులను ఆదేశించారు. దాంతో నిన్న రాత్రి నుంచే యాదాద్రి అష్టబుజి ప్రకార మండపంలో స్తంభాలపై చెక్కిన రాజకీయ సంబందమైన అన్ని బొమ్మలను తొలగించే పని మొదలుపెట్టారు. ఇకపై ఆగమ శాస్త్ర ప్రకారమే బొమ్మలు చెక్కబోతున్నారు.