సంబంధిత వార్తలు

మెగాస్టార్ చిరంజీవితో సహా 120 మంది ప్రయాణికులతో నిన్న సాయంత్రం ముంబై నుంచి హైదరాబాద్ బయలుదేరిన విస్తారాకు చెందిన (ఫ్లైట్ నెంబర్ యుకె-869) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన అర్ధగంట తరువాత విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలట్లు వెంటనే దానిని వెనక్కు మళ్లించి ముంబై విమానాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిపోయింది.