జిల్లాలకు చేరుతున్న బతుకమ్మ చీరలు

బతుకమ్మ చీరలు తయారీపని దాదాపు పూర్తవడంతో వాటిని అధికారులు జిల్లాల వారీగా పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీకి 18 ఏళ్ళు నిండిన అమ్మాయిలకు కూడా బతుకమ్మ చీరలు పొందడానికి అర్హులే. వచ్చే నెల 10వ తేదీలోగా చీరలను పంపిణీ మొదలుపెట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా వ్యవసాయ సిరిసిల్ల నుంచి జిల్లాలోని మార్కెట్ గోదాములకు తరలించి అక్కడి నుంచి రేషన్ షాపులకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్ల నుంచి రేషన్ షాపులవరకు చీరల పంపిణీలో ఎక్కడా లోపాలు, అవకతవకలు జరుగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ‘రూట్ ఆఫీసర్లను’ నియమించుకొంటున్నారు. ఇప్పటికే అనేక జిల్లాలకు బతుకమ్మ చీరలు చేరుకొన్నాయి కూడా. కనుక ఎట్టి పరిస్థితులలో సెప్టెంబర్ 10వ తేదీలోగానే బతుకమ్మ చీరల పంపిణీ మొదలుపెట్టి బతుకమ్మ పండుగలోగా పూర్తిచేసేవిధంగా  అధికారులు కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేసుకొన్నారు.