ప్రస్తుతం 133 కోట్లు..ఇక ముందు ఎంతో?

2010-11 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు ఉండేది. అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుత జనాభా 133.92 కోట్లు. అంటే గత 10 ఏళ్ళలో భారతదేశ జనాభా 13 కోట్లు పెరిగిందన్న మాట. గతంతో పోలిస్తే దేశంలో జనాభా పెరుగ్దల కాస్త తగ్గినట్లే ఉంది కానీ ఖచ్చితమైన లెక్క తెలియాలంటే జనాభా లెక్కల సర్వే చేయాల్సిందే. అందుకే దేశంలో ప్రతీ 10 ఏళ్ళకు ఓసారి జనాభా లెక్కలు తీస్తుంటారు. మళ్ళీ 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జనాభా లెక్కల సర్వే కార్యక్రమం మొదలుపెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.