త్వరలో కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ పర్యటన

సిఎం కేసీఆర్‌ త్వరలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పరిశీలించేందుకు రాబోతున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సిఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, టేశ్ ముఖ్యనేతలు సోమవారం సమావేశమయ్యారు. సిఎం కేసీఆర్‌ పర్యటనలో ప్రాజెక్టును పరిశీలించి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. త్వరలోనే సిఎం కేసీఆర్‌ జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు అవుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.